Monday, September 9, 2013

Gajwel History (Gajwel Mega City..)

గజ్వేల్ పట్టణము హైదరాబాద్ నుండి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. గజ్వేల్ నియోజకవర్గము  2009 సంవత్సరములో జరిగిన సాధారణ ఎన్నికలలో తూంకుంట నర్సారెడ్డి  కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచాడు. 2014 లో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాన రాష్త్ర సమితి నుండి గెలిచారు. ఈ గజ్వేల్ నియోజకవర్గము కింద కొండపాక , తూప్రాన్, వర్గల్, ములుగు, మరియు జగదేవ్పూర్ మండలాలు ఉన్నాయి. 

గజ్వేల్ కు ఆ పేరు ఎలా వచ్చింది? 
మన ఊరి పూర్వీకులు మూడు కథలు చెబుతుంటారు అందులో మొదటిది నిజాం ప్రభువు గజ్వేల్ ను పరిపాలించే రోజులలో గజ్వేల్ లో గజశాల అనగా (ఏనుగుల శాలగా) ఉపయోగించేవారు. అందుచేత గజ్వాల అని తరువాత అది కాస్త గజ్వేల్ అని పిలవబడుతున్నది. రెండవది ఈ ఊరికి పూర్వ కాలంలో ఒక పెద్ద నీటి కరువు వచ్చింది దానిని నివారించడానికి ఊరికి దగ్గరలో ఉన్న మలక బావి నుండి గజాలను ఉపయోగించి నీరు మోట కొట్టి ఊరికి పారించి కరువు ను నివారించారు. ఆ తరువాతగజాలవల్ల నీరు ఊరి మీదుగా వెళ్ళినవి కాబట్టి ఈ ఊరికి గజవేల్లి గ నామకరణం చేసారు.
మూడవది ఏమిటంటే గజ్వేల్ చెరువును పాండవుల చెరువు గా పిలుచుకుంటారు ఎందుకంటే  పాండవుల వనవాసం కాలంలో ఈ చెరువు దగ్గర కొద్ది రోజులు గడిపారని చెప్పుకుంటారు. అంతే కాకుండా భీముడు ఇక్కడి నుండి వెళ్లి పోవునపుడు తన గదను వదలి వెళ్ళెను. అందుచేత గదవధలి   అని తరువాత అది కాస్త గదవల్లి --> గజవెల్లి --> గజ్వేల్ గా రూపాంతరం చెందాయి.

గజ్వేల్ లో 100 పడకల ఆసుపత్రి తో పాటు మరి కొన్ని ప్రైవేటు నర్సింగ్ హోం లు మరియు హాస్పిటల్స్ వున్నాయి. ఇక బ్యాంకుల గురించి చెప్పాలంటే
స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా
స్టేట్ బ్యాంకు అఫ్ హైదరాబాద్
ఆంధ్ర బ్యాంకు
మంజీరా గ్రామీణ బ్యాంకు మరియు co operative బ్యాంకులు ఉన్నాయి.

గజ్వేల్ లో దేవాలయాలు:
పాండవుల చెరువు
రాములవారి గుడి
అయ్యప్ప గుడి
కృష్ణుని గుడి
వేంకటేశ్వరుని గుడి
శంకరుని గుడి
ఆంజనేయ స్వామి గుడి
సంతోషిమాత గుడి
సాయి బాబా గుడి
వీటి తో పాటు మసీదులు మరియు ఒక క్రిస్టియన్ చర్చి కూడా ఉంది.

మరి గజ్వేల్లో విందు, వినోదానికి... 
మినీ మల్తిప్లెక్ష్ (సంతోష్ & సంగీత) మూవీ టాకీస్
యాదగిరి మూవీ టాకీస్
బాలాజీ టాకీస్
చుట్టూ పక్కల పార్కులు మరియు దాబాలు ఎన్నెన్నో..

గజ్వేల్ పారిశ్రామిక అబివృద్ధి:
రానే బ్రేక్ లైన్స్
మార్స్ ఇండియా వారి డాగ్ ఫుడ్ మానుఫాక్ట్చరింగ్ కంపెనీ
కండోమ్స్ ఫ్యాక్టరీ

విద్య మరియు వైద్య అభివ్రుద్ది:
హర్టికల్చర్ విశ్వవిద్యాలయము
100 బెడ్ ప్రభుత్వ ఆసుపత్రి


గజ్వేల్ యొక్క ప్రత్యేకతలు:
  • గజ్వేల్ నుండి 10 km దూరంలో గ్రేటర్ హైదరాబాద్ బౌండరీ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫుతురె లో మా వూరు హైదరాబాద్ లో కలిసిపోయే అవకాశాలు చాల ఎక్కువ.
  • గజ్వేల్ పట్టణము నుండి హైదరాబాద్ వెళ్ళే దారిలో సుమారు మా వూరి నుండి 18km దూరం లో PRAJAY టౌన్షిప్, డార్లింగ్ కేవ్, స్పెషల్ ఎకనామిక్ జోన్ లు కలవు. 
  • గజ్వేల్ నియోజకవర్గం లోని ప్రజల అభిప్రాయం మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజల majority అభిప్రాయం తో ఏకీభవిస్తుంది. దీనికి నిదర్శనం ఏమిటంటే ప్రతి అసెంబ్లీ ఎన్నికలలో గజ్వేల్ లో ఏ పార్టీ అయితే విజయం సాధిస్తుందో అదే పార్టీ మన స్టేట్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది
గజ్వేల్ దగ్గరలో ఉన్న విహార ప్రదేశాలు: 

వర్గల్ సరస్వతి ఆలయము 
నాచారం లక్ష్మి నరసింహ స్వామి దేవాలయము
పాండవుల చెరువు